‘ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​’ తెచ్చిన ఐసిసి

ఇక నుంచి నెల రోజుల ఆటగాళ్ళ ప్రదర్శనపై అవార్డ్​

By udayam on January 27th / 9:00 am IST

అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసిసి) క్రికెటర్లకు కొత్త అవార్డును తీసుకొచ్చింది. ప్రతీ నెలా జరిగే మ్యాచ్​లలో మంచి ప్రదర్శన చేసిన పురుషుల, మహిళల జట్ల నుంచి ఒకరికి ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ అవార్డ్​ను ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇందుకోసం ఐసిసి వెబ్​సైట్​లో నిర్వహించే పోల్​ లో పాల్గొని క్రికెట్​ అభిమానులు తమ అభిమాన ప్లేయర్​కు ఓట్​ వేయవచ్చు.

ఐసిసి మెన్స్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​, ఐసిసి ఉమెన్స్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ పేరిట ఈ అవార్డులను ఇవ్వనుంది. ఈ అవార్డుకు న్యాయనిర్ణేతలుగా మాజీ ఆటగాళ్ళు, బ్రాడ్​కాస్టర్లు, అంతర్జాతీయ పత్రికల రిపోర్టర్లు ఉండనున్నారు.

జనవరి నెలకు పోటీలో ఉన్నది ఎవరంటే?

ఐసిసి తీసుకొచ్చిన ఈ కొత్త అవార్డుకు జనవరి నెలకు సంబంధించి ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన భారత ఆటగాళ్ళు ముందు వరుసలో ఉన్నారు.

తొలి టెస్ట్​ సిరీస్​ ఆడిన భారత ఆటగాళ్ళు మహ్మద్​ సిరాజ్​, వాషింగ్టన్​ సుందర్​, నటరాజన్​, రిషబ్​ పంత్​, ఆఫ్ఘనిస్తాన్​ ఆటగాడు రహ్మనుల్లా గుర్బజ్​ లతో పాటు ఇప్పటికే సీనియర్​ ఆటగాళ్ళైన రవిచంద్రన్​ అశ్విన్​ (భారత్​), జో రూట్​ (ఇంగ్లాండ్​), స్టీవ్​ స్మిత్​ (ఆస్ట్రేలియా), మరిజానే కాప్​ (సౌత్​ ఆఫ్రికా), నదీనే దె క్లెర్క్​ (సౌత్​ ఆఫ్రికా), నిదా దార్​ (పాకిస్థాన్​ల)లు పోటీ పడుతున్నారు.