టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురవ్వడానికి రోడ్డుపై ఉన్న భారీ గుంతలే కారణమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు. రవీంద్ర రాఠీ, పంకజ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ, పంత్ యాక్సిడెంట్ కు గురైన చోట గతంలోనూ పలు రోడ్డు ప్రమాదాల జరిగాయని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని వివరించారు. ఈ ప్రాంతంలో హైవే ఇరుకుగా మారడం వలన సర్వీసు రోడ్డు ఇంతవరకు ఏర్పాటు చేయలేదన్నారు. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి పంత్ ప్రమాదానికి గురయ్యాడని ఢిల్లీ క్రికెట్ డైరెక్టర్ శ్యామ్ శర్మ సైతం వ్యాఖ్యానించారు.