రిషి కపూర్​, ఇర్ఫాన్​లకు బాఫ్తా నివాళి

By udayam on April 12th / 6:20 am IST

74వ బ్రిటిష్​ అకాడమీ ఫర్​ ఫిల్మ్​ అండ్​ టెలివిజన్​ (బాఫ్టా) అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఇటీవల మరణించిన భారత దిగ్గజ నటులు రిషి కపూర్​, ఇర్ఫాన్​ ఖాన్​లకు నటీనటులు నివాళులర్పించారు. వీరితో పాటు షాన్​ కానరీ (తొలి జేమ్స్​బాండ్​), కిర్క్​ డగ్లక్​, చాద్విక్​ బోస్​మన్​ (బ్లాక్​ పాంథర్​)లకు సైతం బాఫ్టా నివాళులర్పించింది. ఈ మేరకు వీరందరి కోసం ఓ ప్రత్యేక వీడియోను ఈ షోలో ప్రదర్శించారు. గత ఏడాది మృతిచెందిన మొత్తం 40 మంది ప్రపంచంలోని ప్రముఖ యాక్టర్లకు, రైటర్స్​, డైరెక్టర్స్​, టెక్నీషియన్లకు బాఫ్టా ఈ షోలో నివాళులర్పించింది.

ట్యాగ్స్​