గచ్చిబౌలి: టిప్పర్​ బ్రేక్​ ఫెయిల్​.. వాహనాలు నుజ్జు.. ఒకరు మృతి

By udayam on December 26th / 6:43 am IST

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో అర్ధరాత్రి అదుపుతప్పిన ఈ టిప్పర్​ అప్పటికే అక్కడ సిగ్నల్​ పడడంతో ఆగి ఉన్న వాహనాలపైకి ఎక్కేసింది. ఈ ఘటనలో నాలుగు కార్లు మరియు రెండు బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. టిప్పర్ నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు సరిగా పడకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతుంది.

ట్యాగ్స్​