స్పీకర్ తమ్మినేనికి తృటిలో తప్పిన ప్రమాదం

By udayam on November 21st / 11:17 am IST

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. అయితే ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం మధ్నాహం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఆముదాలవలస మండలం వంజంగి వద్ద కాన్వాయ్‌లోకి ఓ ఆటో వేగంగా దూసుకుని వచ్చింది.

ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్పీకర్ కారు డ్రైవర్‌ అప్రమత్తంగా ఉండటంతో తమ్మినేనికి పెద్ద ప్రమాదం తప్పింది. అలాగే ఆటో దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులు మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు తగలేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.