గోషామహల్​: కుంగిన నాలా.. పలువురికి గాయాలు

By udayam on December 23rd / 12:27 pm IST

హైదరాబాద్​ లోని గోషామహల్​ ప్రాంతంలో ఉన్న ఓ నాలా ఉన్నట్టుండి 12 అడుగుల మేర భూమిలోకి కుంగిపోయింది. దీంతో నాలాపై నడుస్తున్న మనుషులు, నిలిపి ఉంచిన కార్లు, ఆటోలు, తోపుడు బండ్లు ధ్వంసమయ్యాయి. శుక్రవారం రోజున రద్దీగా ఉండే గోషామహల్​ మార్కెట్​ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు నెట్టింట వైరల్​ గా మారాయి. దుకాణాలతో సహా నాలాలో పడ్డ కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు అక్కడి నుంచి జనాన్ని తప్పిస్తున్నారు. ఘటన స్థలానికి స్థానికి ఎమ్మెల్యే రాజాసింగ్​ చేరుకుని స్థానికులతో మాట్లాడారు.

ట్యాగ్స్​