రోడ్డు ట్యాక్స్​ భారీగా పెంచుతూ ఏపీ సర్కార్​ నిర్ణయం

By udayam on January 12th / 6:30 am IST

పొద్దున్న లేచింది మొదలు ప్రజలపై పన్నుల భారంతో విరుచుకుపడే ప్రభుత్వాలు.. తాజాగా మరోసారి అదే దారిని ఎంచుకున్నాయి. త్రైమాసిక రోడ్‌ట్యాక్స్‌ను భారిగా పెంచుతూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భారం సగటున 30శాతంపైనే ఉన్నట్లు వాహన యజమానులు చెబుతున్నారు. 6 టైర్ల లారీలకు రూ 3,940లుగా వున్న రోడ్‌ట్యాక్స్‌ను రూ 4,970లకు పెంచింది. అలాగే 10 టైర్ల లారీకి రూ.6,580లు వుంటే రూ.8,390లకు పెంచారు. అలాగే 12 టైర్లలారికి రూ.8,520ల నుండి రూ.10,910లకు, 14 టైర్ల లారీకి రూ.10,480ల నుండి రూ.13,430లకు పెంచారు.

ట్యాగ్స్​