ఈడీ: టైం ఇవ్వలేం.. విచారణకు రావాల్సిందే

By udayam on December 19th / 9:39 am IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. ఇవాళ విచారణకు హాజరు కాలేనని, కొంత సమయం కావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లేఖ ద్వారా చేసిన విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందు హాజరు కానున్నారు. ఏ కోణంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ విచారణ చేయనుందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్​