శ్రీలంకతో సిరీస్​ కు దూరంగా రోహిత్​, రాహుల్​!

By udayam on December 26th / 12:06 pm IST

శ్రీలంకతో వచ్చే ఏడాది లో జరగనున్న హోం సిరీస్​ కు భారత జట్టు కెప్టెన్ రోహిత్​ శర్మ, తాత్కాలిక కెప్టెన్​ కెఎల్​ రాహుల్​ లు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. ఈ సిరీస్​ లో భారత్​.. లంకేయులతో మూడు టి29లు, 3 వన్డేలు ఆడనుంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్​ జనవరి 15తో ముగుస్తుంది. బంగ్లాతో మూడో వన్డేలో గాయపడ్డ రోహిత్​ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం ఓ కారణమైతే.. అతియా శెట్టితో పెళ్ళి కోసం రాహుల్​ సైతం ఈ సిరీస్​ కు దూరంగా ఉండనున్నాడని సమాచారం.

ట్యాగ్స్​