టి20 ల నుంచి తప్పుకునే ఉద్దేశ్యం ఏదీ తనకు లేదన్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. శ్రీలంకతో నేటి నుంచి జరుగుతున్న వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడిన అతడు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తాను గైర్హాజరు కావడంతో టి20 సిరీస్ కు హార్ధిక్ పాండ్య ను ఎంపిక చేయడం వల్లే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయన్న అతడు.. 2023 ఐపిఎల్ తర్వాత నా నిర్ణయం ఎలా ఉంటుందో నాకూ తెలియదు అని చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లకు తగిన విశ్రాంతి అవసరమని మరోసారి స్పష్టం చేశాడు.