బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కూ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలో బొటన వ్రేలికి తీవ్ర గాయం కారణంగా తొలిటెస్ట్‌కు దూరమైన రోహిత్ ముంబయికి చేరుకొని చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో చటోగ్రామ్‌లో జరిగిన తొలి టెస్టులో దూరమయ్యాడు. రెండో టెస్ట్‌కైనా కోలుకొంటాడని ఆశించినా.. గాయం తగ్గకపోవడంతో రెండో టెస్ట్‌కూ రోహిత్ దూరమైనట్లు బిసిసిఐ సోమవారం ట్విటర్‌లో వెల్లడించింది.