శ్రీశైలం–ఈగలపెంట మధ్య రోప్​ వే

By udayam on December 15th / 7:20 am IST

పర్వతమాల పథకంలో భాగంగా ఏపీలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం శ్రీశైలం–ఈగలపెంట మధ్య రోప్​ వే ను ఏర్పాటు చేయడానికి ఏపీ సర్కార్​ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్రం అనుమతులు వచ్చిన ఈ ప్రాజెక్ట్​ కు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రంలో మరో మూడు చోట్ల రోప్​ వే ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇంద్రకీలాద్రి-భవానీ ద్వీపం, లంబసింగి, గండికోట టూరిస్ట్​ స్పాట్స్​ లోనూ ఈ రోప్​ వే ను ఏర్పాటు చేయాలని అద్యయనాలు చేస్తున్నారు.

ట్యాగ్స్​