బాహుబలికి 32 వారాలు.. ఆర్​ఆర్​ఆర్​ కు 4 వారాలే

By udayam on November 17th / 7:45 am IST

టాలీవుడ్​ జక్కన్న రాజమౌళి తాజా పాన్​ ఇండియా హిట్​ ఆర్​ఆర్​ఆర్​ జపాన్​ దేశంలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇటీవలే అక్కడ విడుదలైన ఈ చిత్రం ఆ దేశంలో అత్యంత వేగంగా 250 మిలియన్​ యెన్​ లు కలెక్షన్లు కొల్లగొట్టిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ కలెక్షన్​ రికార్డ్​ కు ఆర్​ఆర్​ఆర్​ కు కేవలం 3 వారాల 6 రోజులు పడితే.. బాహుబలి–2 కు 32 వారాలు పట్టింది.రామ్​ చరణ్​ అల్లూరి సీతారామరాజుగానూ, ఎన్టీఆర్​ కొమురం భీం గానూ నటించిన ఈ చిత్రంలో అలియా భట్​, అజయ్​ దేవ్​ గన్​ లు కూడా నటించారు.

ట్యాగ్స్​