ఆస్కార్​ నామినేషన్లు పట్టేసిన కాంతార, ఆర్​ఆర్​ఆర్​, కశ్మీర్​ ఫైల్స్​

By udayam on January 10th / 10:46 am IST

ప్రపంచ సినీ పండుగ ఆస్కార్​ అవార్డులకు భారత్​ నుంచి మొత్తం ఐదు సినిమాలు నామినేషన్లను పట్టేశాయి. వీటిల్లో రిషబ్​ శెట్టి మూవీ కాంతారకు రెండు, రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​, వివేక్​ అగ్నిహోత్రి మూవీ ది కశ్మీర్​ ఫైల్స్​, సంజయ్​ లీలా భన్సాలీ గంగూభాయి ఖతియావాడితో పాటు భారత అధికారిక ఆస్కార్​ ఎంట్రీ చెల్లో షోలు ఉన్నాయి. వీటితో పాటు మరాఠీ సినిమాలు మే వసంతరావు, తుజ్యా సాతి కహీ హై, ఆర్​ మాధవన్​ నటించిన రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్, ఇరావిన్​ నిఝల్​, కన్నడ సినిమా విక్రాంత్​ రోనాతో పాటు డాక్యుమెంటరీ విభాగంలో భారత్​ నుంచి ఆల్​ దట్​ బ్రీతెస్​, ది ఎలిఫెంట్​ విస్పరర్స్​ కూ చోటు దక్కింది. అయితే మొత్తం 301 సినిమాలకు నామినేషన్లు దక్కగా ఫైనల్​ లిస్ట్​ ను ఈనెల 26న ఆస్కార్​ కమిటీ ప్రకటించనుంది.

ట్యాగ్స్​