మార్వెల్​ టీంతో ఎన్టీఆర్​ చర్చలు! హాలీవుడ్​ ఎంట్రీ కోసమేనా!!

By udayam on January 18th / 6:42 am IST

ఆర్​ఆర్​ఆర్​ తో గ్లోబల్​ స్టార్​ గా ఎదిగిన జూనియర్​ ఎన్టీఆర్​ ఇప్పుడు హాలీవుడ్​ మూవీలో నటించే అవకాశం కనిపిస్తోంది. అవెంజెర్స్​ సిరీస్​ ను తెరకెక్కించిన మార్వెల్​ సినిమాటిక్​ యూనివర్శ్​ టీమ్​ తో ఎన్టీఆర్​ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇటీవలు జరిగిన గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్​ ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఎంసియు టీం ఎగ్జిక్యూటివ్​ తో ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు మార్వెల్​ కానీ, ఇటు ఎన్టీఆర్​ పీఆర్​ టీం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ట్యాగ్స్​