సైదాబాద్​ నిందితుడి ఆచూకీపై రూ.10 లక్షల రివార్డ్​

By udayam on September 14th / 6:41 pm IST

సైదాబాద్​లో 6 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి భారీ నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. నిందితుడు ఆచూకీ చెప్తే రూ.10 లక్షల రివార్డ్​ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం నిందితుడి ఆనవాళ్ళను సైతం పోలీసులు విడుదల చేశారు. వయసు 30, పేరు పల్లకొండ రాజు, ఎత్తు 5.9, టోపీ, రెడ్​ కలర్​ స్కార్ఫ్​, చేతులపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు ఉంటుందని తెలిపారు. ఎవరికైనా ఆ వ్యక్తి కనిపిస్తే 94906 16366 నెంబరుకు ఫోన్​ చేయొచ్చని తెలిపారు.

ట్యాగ్స్​