1.50 లక్షల కోట్లకు చేరిన జిఎస్టీ వసూళ్ళు

By udayam on January 2nd / 6:17 am IST

డిసెంబర్లో భారత ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో భారీ ఆదాయం దక్కింది. అంతకు ముందు నెల నవంబర్​ తో పోల్చితే డిసెంబర్లో 15 శాతం వసూళ్ళు పెరిగిరూ.1,49,507 కోట్ల జిఎస్టీ వసూలైంది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.26,711 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.33,357 కోట్లు అని వివరించింది. సమీకృత జీఎస్టీ రూ.78,434 కోట్లు, సెస్ రూపంలో మరో రూ.11,005 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ ఆదాయం వరుసగా పదో నెల కూడా రూ.1.4 లక్షల కోట్లు దాటడం విశేషం.

ట్యాగ్స్​
GST