ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో చర్చిల అభివృద్ధికి భారీ నిధులను కేటాయించింది. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున అందించనుంది. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. క్రైస్తవుల శ్మశానాల ఆధునికీకరణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది.