డ్రీమ్​ 11లో రూ.2 కోట్లు గెలిచిన ‘రాజా’

By udayam on May 23rd / 12:39 pm IST

ఐపిఎల్​ మ్యాచ్​ల కోసం డ్రీమ్​ 11 యాప్​లో బెట్టింగ్​ కాసిన జమ్మూ కశ్మీర్​ వసీమ్​ రాజా రాత్రికి రాత్రే కోటీశ్వరుడయిపోయాడు. అతడికి ఈ యాప్​లో రూ.2 కోట్ల బంపర్​ ప్రైజ్​ దక్కింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్​ అతడిని అభినందనలతో ముంచెత్తారు. ‘గత రెండేళ్ళుగా ఐపిఎల్​ టైమ్​లో తాను డ్రీమ్​ 11లో బెట్​ చేస్తున్నా. ఈరోజు నాకు అదృష్టం బాగుంది’ అని వసీమ్​ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. ‘రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావడం ఆనందంగానే ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​