ఏపీలో ఎమెర్జెన్సీ రన్​ వేస్​ గా హైవేలు

By udayam on December 28th / 9:59 am IST

ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాలలో జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారిపై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు ప్రాంతాల్లో రన్ వేలుగా అభివృద్ది చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పిచ్చికలగుడిపాడు వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రైల్ రన్ ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బాపట్ల జిల్లా కలెక్టర్ కె.విజయ కృష్ణన్, వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ ఆర్ ఎస్ చౌదరి, జాతీయ రహదారుల అధికారులతో కలిసి సాయంత్రం పరిశీలించారు.

ట్యాగ్స్​