బెంగాల్‌లోని కట్వా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న ఓ కాంట్రాక్టర్‌కు నెల రోజులకు గానూ రూ.1 కోటి బిల్లు వేశారు. ఇందులో అతడు తిన్న బిర్యానీకి రూ.3.20 లక్షలు వేయడంతో ఖంగుతిన్న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి బెడ్‌కు రూ.82 వేలు.. ఇలా అన్ని సేవలకూ దారుణంగా బిల్లులు వేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే రూ.1 కోటి రూపాయలలో దాదాపుగా అన్ని మందుల బిల్లులేనని వైద్యులు చెబుతున్నారు.