వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత స్థానం మరింత దిగజారింది. 2016లో 133లో ఉన్న మన ర్యాంకు 2021లో 150 కు పడిపోయిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ పేర్కొంది. మొత్తం 180 దేశాలలోని పత్రికా స్వేచ్ఛపై ర్యాంకులు ఇచ్చే ఈ సంస్థ భారత్‌కు గతేడాది 142వ ర్యాంకు ఇవ్వగా.. తాజాగా 150తో సరిపెట్టింది. జర్నలిస్టులకు మన దేశంలో అత్యంత హీన దశ నడుస్తోందని ఈ సంస్థ గతేడాదే పేర్కొంది. నిజాలు చెప్పే జర్నలిస్టులపై దాడులు భారత్‌లో పెరుగుతున్నాయని తెలిపింది.