ప్రతీ మసీదు పునాదుల్లోనూ శివలింగాల్ని వెతకడం మానుకోవాలని హిందూ సంఘాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజ్ఞప్తి చేశారు. కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికడంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘జ్ఞానవాపి మసీదు విషయంలో చరిత్రను మార్చలేం. ఆ రోజుల్లో భారత స్వాతంత్రాన్ని దెబ్బతీసేందుకే ముస్లింలు హిందూ ఆలయాల్ని కూలగొట్టారు. అయితే ఇప్పుడు మనం పరస్పర అంగీకారంతో ముందుకెళ్ళొచ్చు’ అని పేర్కొన్నారు.