ఈ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్​ తప్పనిసరి

By udayam on December 30th / 10:33 am IST

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా, హాంగ్ కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఆయా దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేసింది.

ట్యాగ్స్​