ప్రైవేట్​ ట్రావెల్స్​ పై ఆర్టీఎ దాడులు

By udayam on January 12th / 6:37 am IST

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా భాగ్యనగరంలో రవాణాశాఖ అధికారులు ఉదయమే రోడ్డెక్కారు. పండుగ సమయం కావడంతో.. నాలుగు రోజుల నుంచి ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఈరోజు ఉదయం ఎల్బీనగర్‎లో దాడులు నిర్వహించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను అధికారుల బృందం తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా ఝుళిపించారు.

ఆరు ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేసి..మరో 3 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణికులతో పాటు లగేజిని కూడా రవాణా చేస్తున్న బస్సులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

అలాగే అంబర్ పెట్ ఔటర్ రింగు రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులను సీజ్ చేశారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.