శ్రీలంక అల్లర్లలో అధికార పార్టీ ఎంపీ మృతి

By udayam on May 9th / 2:30 pm IST

శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్స మద్దతుదారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వర్గానికి జరుగుతున్న అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అల్లర్లలో అధికార పార్టీకి చెందిన పార్లమెంట్​ సభ్యుడు అమరకీర్తి అథుకొరల మృతి చెందాడు. దేశ రాజధాని కొలంబో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెలరేగిన హింసలో ఇప్పటి వరకూ 79 మంది గాయపడ్డారు. కొంత మంది రాజపక్స మద్దతుదారులు కొన్ని గుడారాలను ధ్వంసం చేశారు. పోలీసులు వారిపై వాటర్​ గన్స్​, బాష్పవాయువులను ప్రయోగించారు.

ట్యాగ్స్​