5:36 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఫాస్టెస్ట్​ ఫింగర్స్​ ఫస్ట్​ ఆడకుండానే హాట్‌సీట్‌ కి చేరిన తొలి మహిళ 2 weeks ago

ముంబై: ‘కౌన్ బనేగా క్రోర్‌పతి లో ఫాస్టెస్ట్​ ఫింగ్స్​ ఫస్ట్​ ఆడకుండానే హాట్‌సీట్‌ సాధించిన తొలి మహిళగా రునా షా (43) అనే మహిళ రికార్డు క్రియేట్ చేసారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా నడుస్తున్న  ‘కౌన్ బనేగా క్రోర్‌పతి-12’లో రునా షా (43) అనే మహిళ ఈ అరుదైన రికార్డు సృష్టించారు.

దీంతో  కేబీసీ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. కేబీసీ మొట్టమొదట ప్రారంభమైనప్పటి నుంచి హాట్‌సీట్‌కు చేరుకోవాలని ప్రయత్నిస్తున్న రునా షా ఎట్టకేలకు గురువారం తన కలను నెరవేర్చుకున్నారు.

ఇంటర్వ్యూ జరిగేంత వరకు కేబీసీకి వెళ్లేందుకు తాను చేస్తున్న ప్రయత్నాల గురించి ఆమె తన కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త  పడడం మరో విశేషం. గురువారం గేమ్ మొదలైనప్పుడు ముగ్గురు పార్టిసిపెంట్స్ మాత్రమే ఉండగా, రునా షా చివరి కంటెస్టెంట్‌గా మిగిలిపోయారు.

దీంతో ఇక్కడి వరకు వచ్చి హాట్‌సీట్‌కు చేరుకోలేకపోతున్నందుకు రునా కంటతడి పెట్టడాన్ని గమనించిన బిగ్ బి  ఆమెను హాట్‌సీట్‌కు ఆహ్వానించడంతో ఆమె  హాట్‌సీట్‌లో కూర్చున్నాక ఎమోషన్ కి గురయ్యారు. ఇది కలా నిజమా అని ఆమె ఏడ్చేశారు.
దీంతో ఆమెను అమితాబ్‌తోపాటు ఆమె భర్త, కుమార్తె సముదాయించారు. హాట్‌సీటుకు చేరుకోకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ టీవీ చూడకూడదని నిర్ణయించుకున్నానని, హాట్‌సీటుకు చేరుకోవాలని దేవుడిని ప్రార్థించానని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నారు.