2.27 గంటల రన్​ టైమ్​ లాక్​ చేసిన ‘తెగింపు’

By udayam on December 24th / 4:27 am IST

తమిళ అగ్రనటుడు అజిత్​ లేటెస్ట్​ మూవీ ‘తెగింపు’ రన్​ టైమ్​ ను లాక్​ చేశారు. 2.27 నిమిషాల పాటు ఈ మూవీ రన్​ కానుందని తెలుస్తోంది. దొంగతనాలే ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి హెచ్​.వినోద్​ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్​ నిర్మాతగా ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతికి విడుదల కానుంది. అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్యాగ్స్​