డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలరుకు మారకం విలువ 77.1825 రూపాయిలుగా ఉంది. 2 నెలల క్రితం రూపాయి 76.9812 స్థాయికి పడడమే ఇప్పటి వరకూ రికార్డ్. ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సమయంలో రూపాయి సైతం తన విలువలో 0.3 శాతాన్ని కోల్పోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ విదేశీ పెట్టుబడులు 17.7 బిలియన్ డాలర్లు మార్కెట్ నుంచి తరలిపోయాయన్న వార్తలతో ఈ పతనాలు కొనసాగుతున్నాయి.