యుక్రెయిన్‌లోని రేవు పట్టణం మరియుపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామన్న రష్యా తాజాగా ఆ నగరంలో 3 రోజుల కాల్పుల విరమణ పాటించడానికి సిద్ధమైంది. అజోవస్తల్ స్టీల్ ప్లాంట్‌ను ముట్టించిన దళాలు ప్లాంట్‌లోని పౌరులను తరలించడానికి మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అజోవస్తల్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా యుక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోన్న విషయం తెలిసిందే.