జపాన్​ ప్రధానిపై రష్యా బ్యాన్​

By udayam on May 4th / 11:58 am IST

ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్న తమపై ఆంక్షలు విధిస్తున్న దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రష్యా తాజాగా జపాన్​ ప్రధానిపై ఆంక్షలు విధించింది. ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడాతో పాటు విదేశాంగ మంత్రి యోషిమస హయషి, రక్షణ మంత్రి నొబుయో కిషిలను రష్యాలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ బ్యాన్​ విధించింది. వీరితో పాటు 63 మంది జపాన్​ ప్రముఖులపైనా రష్యాలోకి రాకుండా నిషేధం విధించింది. వీరిలో జపాన్​ అధికారులు, జర్నలిస్టులు, అధ్యాపకులు ఉన్నారు.

ట్యాగ్స్​