ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్న రష్యన్ దళాలు ఆ దేశానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశాయి. ఈ విషయాన్ని రష్యా అధికారి ఆండ్రే వ్లాదిమిర్ షెఫ్చిక్ స్వయంగా వెల్లడించారు. ‘జపొరిజ్జియా ప్లాంట్ నుంచి కరెంట్ సరఫరాను నిలిపివేశాం. అయితే మేం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా కొనసాగుతుంది’ అని అతడు ప్రకటించాడు. దీంతో యూరప్‌లోనే 2వ అతిపెద్ద దేశం యుక్రెయిన్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రం కానుంది.