ఉక్రెయిన్ యుద్ధంలో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లోని ప్రజలకు రష్యా తన పౌరసత్వాన్ని కట్టబెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రష్యా తన సిటిజన్‌షిప్, పాస్‌పోర్ట్ చట్టాల సవరణకు పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పటికే రష్యా చేతిలోకి వెళ్ళిన ఖేర్సన్, జాపోరిజ్జియాల్లోని ప్రజలకు రష్యా పాస్‌పోర్ట్‌లను కట్టబెడుతోంది. అయితే దీనిని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండిస్తూ.. ఇది మా దేశ సరిహద్దు సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యలని ఖండించింది.