21 మిగ్​లకు రష్యా ఓకే

By udayam on July 21st / 9:59 am IST

గతేడాది భారత ప్రభుత్వం ఆర్డర్​ చేసిన 21 మిగ్​–29 విమానాలకు రష్యా ప్రభుత్వం వాటి ఉత్పత్తికి అంగీకారం తెలిపింది. సింగిల్​ సీట్​ సామర్థ్యం ఉండే ఈ మిగ్​–29 యుద్ధ విమానాల్లో ట్విన్​ జెట్​ ఇంజిన్లు ఉంటాయి. వీటితో పాటు మరో 12 సుఖోయ్​ మార్క్​1 విమానాలకు సైతం భారత్​ 2020లో రష్యాకు ఆర్డర్​ చేసింది. భారత సైన్యంలో ఇప్పటికే మూడు మిగ్​–29ఎస్​ స్వ్కాడ్రన్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 21 మిగ్​–29లను సమకూర్చుకోనుంది.

ట్యాగ్స్​