ఉక్రెయిన్ పై నరమేథం జరుపుతూ.. దీనికి మమ్మల్ని ఒక్కర్నే బాధ్యుల్ని చేయడం సరికాదంటున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ‘మూడు దేశాల విధానాల ఫలితమే ఈ యుద్ధం’ అంటూ చెప్పుకొచ్చిన ఇతడు ఉక్రెయిన్ ను మేం ఎప్పుడూ సోదర దేశంగానే చూశామంటూ పేర్కొన్నాడు. సీనియర్ మిలటరీ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన ఈ ప్రసంగాన్ని బుధవారం రష్యా టివిల్లో ప్రసారం చేశారు. ఉక్రెయిన్ కు చౌకగా ఇంధనం ఇచ్చాం.. తక్కువ వడ్డీకే రుణాలూ ఇచ్చాం. కానీ ఆ దేశం పశ్చిమ దేశాల మాటలే విని పరిస్థితిని యుద్ధం వరకూ తీసుకొచ్చింది అని పుతిన్ చెప్పుకొచ్చాడు.