ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ క్షిపణి పరీక్షల్లో దూకుడుగా ఉంటున్న రష్యా తాజాగా ఖండాంతర క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది. వచ్చే వారంలో తొలి మూడు రోజుల్లోనే జరిపే ఈ క్షిపణి ఇంగ్లాండ్ కంటే పెద్ద ప్రాంతాన్ని తునాతునకలు చేయగలదని రష్యా పేర్కొంది. ఈ క్షిపణి పరీక్ష సందర్భంగా ఆ దేశంలోని కంచట్కా రీజియన్ లోని నివాసులకు, టూరిస్టులకు ఎమెర్జెన్సీని ప్రకటించింది. ఏప్రిల్ 20న రష్య ఆర్మీ సతాన్–2 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది.