రష్యాకు చెందిన ఎంపీ పావెల్ ఆంటెవ్(65), ఒడిశాలోని ఒక హోటల్‌లో చనిపోయారు. ముగ్గురు స్నేహితులతో కలిసి భారతకు వచ్చిన ఆయన, రాయగడలో ఈ నెల 21 నుంచి ఉంటున్నారు. శనివారం పావెల్ చనిపోయి పడి కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అంతకు రెండు రోజుల ముందు అదే హోటల్‌లో ఉంటున్న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనొవ్ కూడా చనిపోయారు. స్నేహితుని మరణంతో కుంగుబాటుకు లోనై పావెల్ ఆంటెవ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.