ఉక్రెయిన్ రాజధాని క్యీవ్ పై రష్యా దళాలు రోజు మరోసారి క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఆ నగరంలోని నీటి సరఫరా, మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయి. ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అంతర్జాతీయ పత్రికలు రాస్తున్నాయి. క్యీవ్ తో పాటు డెస్నియాన్ జిల్లాలోనూ పేలుళ్ళ శబ్దాలు వినిపించాయి. ఈ దాడులతో ఖార్కివ్ రీజియన్ లో పూర్తిగా పవర్ బంద్ అయి ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు.