నిన్న ఎలన్ మస్క్‌ను చంపుతామంటూ బెదిరింపులకు దిగిన రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ దిమిత్రి రోగోజిన్ నేడు విక్టర్ డే సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రష్యా తలుచుకుంటే నాటో దేశాలన్నింటినీ అరగంటలో నేలమట్టం చేయగలవని బెదిరింపులకు దిగాడు. ‘మా వద్ద ఉన్న అణ్వాయుధాలను వాడాలని పుతిన్ భావిస్తే. 30 నిమిషాల్లో నాటో దేశాలు నేలమట్టమవుతాయి. అయితే మేం ఆ పని చేయం. శత్రువును ఆర్దిక, సైనిక పరంగా ఎదుర్కొని ఓడిస్తాం’ అని చెప్పుకొచ్చాడు.