100 రోజులకు చేరిన ఉక్రెయిన్​ యుద్ధం

By udayam on June 3rd / 10:36 am IST

ఉక్రెయిన్​పై ప్రత్యేక సైనిక చర్య పేరుతో రష్యా జరుపుతున్న దండయాత్ర నేటితో 100 రోజులకు చేరింది. ఇప్పటివరకూ ఉక్రెయిన్​లోని 20 శాతం భూభాగాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ వంద రోజుల్లో రోజుకు 100 మంది సైనికుల్ని తాము కోల్పోయామని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​ స్కీ వెల్లడించారు. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం ఆపడానికి పలుమార్లు శాంతి చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం దక్కలేదు. మరియుపోల్​తో పాటు అజోవ్​స్టల్​ స్టీల్​ ప్లాంట్​ను రష్యా దక్కించుకుంది.

ట్యాగ్స్​