యాసంగి రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమయ్యాయి. యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్న 10వ విడత రైతుబంధు నగదును ప్రభుత్వం అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతలు రైతుబంధు ద్వారా రూ.7,676.61 కోట్ల సహాయం అందుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో వెల్లడించారు.రైతులు, పేదలు సాధికారత పొందే భారతదేశం గురించి కెసిఆర్ కలలు కన్నారని చెప్పారు.