ఆన్​లైన్​లో శబరిమల టిక్కెట్లు

By udayam on November 25th / 10:36 am IST

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే కేరళలోని శబరిమలకు వెళ్ళే భక్తులకు సైతం ఆన్​లైన్​ టికెటింగ్​ వ్యవస్థను తీసుకొచ్చారు. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది ఈ పద్దతిని తీసుకొచ్చినట్లు దేవస్థానం బోర్డ్​ ప్రకటించింది. వర్చువల్​ క్యూ పద్దతిలో టికెట్​ తీసుకున్న వారికి దర్శనం స్లాట్​ను ఇస్తున్నారు. ఈ టికెట్ల బుకింగ్​కు సంబంధించి రెండు వీడియోలను అయ్యప్ప ఆలయ బోర్డ్​ విడుదల చేసింది.

ట్యాగ్స్​