అశోక్​ గెహ్లాత్​ : సచిన్​ ఎప్పటికీ సిఎం కాలేడు

By udayam on November 24th / 12:03 pm IST

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తన ప్రత్యర్థి సచిన్‌పైలెట్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ విరుచుకుపడ్డారు. గురువారం జాతీయ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూలో.. సచిన్​ ను ద్రోహిగా అభివర్ణించారు. పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని వారిని, తిరుగుబాటుదారుడైన సచిన్‌పైలెట్‌ని కాంగ్రెస్‌ అధిష్టానం సిఎంగా నియమించదని అన్నారు. ఆయన పార్టీని మోసం చేశారని, ద్రోహి అని అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు తన సొంత ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం బహుశా భారత్‌లో ఇదే మొదటిదని 2020లో సచిన్‌ తిరుగుబాటునుద్దేశించి పేర్కొన్నారు.

ట్యాగ్స్​