ఇంటికి చేరుకున్న సాయితేజ్​ : చిరు

By udayam on October 15th / 6:51 am IST

గత నెల వినాయక చవితి రోజు రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన నటుడు సాయిధరమ్​ తేజ్​ దసరా రోజున ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయాన్న మెగాస్టార్​ చిరంజీవి ట్వీట్​ చేశారు. యాక్సిడెంట్​ నుంచి సాయితేజ్​ పూర్తిగా కోలుకున్నాడని సైతం చిరంజీవి వెల్లడించారు. ఈ విజయదశమి రోజున మా ఇంట్లో మరింత సంతోషాన్ని కలిగించే వార్త ఇదని మోగాస్టార్​ చెప్పారు. ఇదేరోజు సాయి ధరమ్​ తేజ్​ 34వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.