మ్యారేజ్ వార్తలపై మెగా మేనల్లుడి వెరైటీ క్లారిటీ

By udayam on October 27th / 9:32 am IST

థర్టీ ప్లస్ లోకి అడుగుపెట్టినా స‌రే, పెళ్లికాని టాలీవుడ్ హీరోలు చాలా మంది ఉన్నారు అయితే లాక్‌డౌన్‌లో యంగ్ హీరోలు నిఖిల్‌, నితిన్‌, రానా వ‌రుస‌గా పెళ్లిళ్లు చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో మ‌రికొంద‌రు హీరోలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి.

మెగా మేనల్లుడు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ గ‌తేడాది “ప్ర‌తిరోజు పండ‌గే” సినిమాతో ఆయ‌న‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకుని, ఇప్పుడు ‘సోలో బ్ర‌‌తుకే సో బెట‌ర్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఇతడు త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వార్తలు వైరల్ అయ్యాయి.

దీనికి తోడు అక్టోబ‌ర్ 15న చిరంజీవి అత‌డికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు చెప్తూ నీ బ్యాచిల‌ర్ లైఫ్ ఇంకొన్ని రోజులే’ అంటూ ట్వీట్‌ చేయడంతో మెగా ఇంట మ‌రో పెళ్లికి సిద్ధం అవుతోందంటూ నెటిజ‌న్లు హాట్ హాట్ గా చర్చ మొదలు పెట్టారు. సాయి ధ‌ర‌మ్ స్పందిస్తూ.. “ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తామంటే చూసుకోండ‌ని చెప్పాను, అంతే. కానీ మీడియా వాళ్లే నా పెళ్లి వెన‌క ప‌డ్డారు. ప్ర‌స్తుతానికి పెళ్లంటే ఇంట్రెస్ట్ లేదు. ఒక‌వేళ అమ్మాయి బాగుంద‌ని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తే ఆలోచిస్తా” అంటూ క్లారిటీ ఇచ్చాడు.