‘రౌడీ బేబీ’ సాంగ్‌ డిపిపై సాయిపల్లవి ఫాన్స్ ట్రోల్స్

By udayam on November 20th / 6:15 am IST

కోలీవుడ్ నటుడు ధనుష్‌, రౌడీ బేబీ సాయిపల్లవి కలిసి నటించిన ‘మారి 2’ మూవీలో  ‘రౌడీ బేబీ’ సాంగ్‌ 1 బిలియన్‌ ప్లస్‌ వ్యూస్‌ సాధించి, సౌత్‌ ఇండియాలోనే నెంబర్‌ వన్‌ సాంగ్‌గా రికార్డ్ నెలకొల్పింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మూవీ నిర్మాణ సంస్థ ఓ కామన్‌ డీపీని షేర్‌  చేసింది.

అయితే ఇప్పుడీ కామన్‌ డీపీపై పెద్ద వివాదం చెలరేగి ట్రోల్స్ దాకా వెళ్ళింది. ధనుష్ సరసన సాయిపల్లవి ఉంటేనే ఈ పాట హిట్‌. కానీ విడుదల చేసిన పోస్టర్‌లో మాత్రం కేవలం ధనుష్‌ ఫొటోనే హైలెట్‌ చేసి, సాయిపల్లవిని సైడ్‌ చేశారు.

మరి ఫాన్స్ ఊరుకుంటారా! దీంతో సాయిపల్లవి అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై సీరియస్‌గా ట్రోల్స్ చేస్తూ దుమ్మురేపేస్తున్నారు‌.

సాయిపల్లవి అంటే వారికి భయం పట్టుకున్నట్లు ఉందని నెటిజన్లు చేసే కామెంట్స్‌తో ఇప్పుడీ పోస్టర్‌ వివాదాలను ఎదుర్కొంటోంది. ఇది ఎటు దారితీస్తుందో చూడాలి.