ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న నాని, సాయి పల్లవిల పీరియాడిక్ డ్రామా శ్యామ్ సింగరాయ్‌లో ప్రణవాలయ పాట అన్నింటికంటే హైలైట్‌గా నిలిచింది. ఈ పాట కోసం తాను పడ్డ కష్టాన్ని సాయిపల్లవి తన ఇన్‌స్టా ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకుంది. క్లాసికల్ డ్యాన్స్ సెషన్స్‌ను ప్రొఫెషనల్స్‌తో పోటీ పడి చేయడాన్ని మరిచిపోలేనని క్యాప్షన్ పెట్టింది. క్లాసికల్ రాకపోయినా డైరెక్టర్ నమ్మకాన్ని నిలబెట్టడానికి నేర్చుకున్నా అని సాయి పల్లవి వెల్లడించారు.