జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం #NTR30లో బాలీవుడ్ కంటెంట్ ఎక్కువవుతోంది. పాన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇప్పటికే ఫిక్స్ అవ్వగా.. వీలన్ గా స్టైఫ్ అలీఖాన్ నటించనున్నారని తెలుస్తోంది. యువసుధా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం తారక్ విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుండగా.. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ ఫైనలైజేషన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.