సైనా, ప్రణయ్​లకు కొవిడ్​ పాజిటివ్​

By udayam on January 12th / 9:38 am IST

భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్లు సైనా నెహ్వాల్​, హెచ్​ఎస్​ ప్రణయ్​ లకు జరిపిన కొవిడ్​ టెస్ట్​లో పాజిటివ్​ గా తేలింది. వీరిద్దరికీ థాయిలాండ్​లో జరిపిన మూడు కొవిడ్​ టెస్టుట్లో చివరి టెస్ట్​ పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని భారత బాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సైతం ట్వీట్​ చేసింది.

అయితే సైనా నెహ్వాల్​ భర్త, సింగిల్స్​ ప్లేయర్​ పారుపల్లి కశ్యప్​ రిపోర్ట్​ రావాల్సి ఉంది. సైనా, ప్రణయ్​లను అక్కడి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే గత డిసెంబర్లోనే సైనా, ప్రణయ్​లు కొవిడ్​ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ ఇప్పుడు రెండోసారి ఈ వ్యాధి బారిన పడ్డట్లు తేలింది.