2024 షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని… ప్రజాతీర్పు ప్రకారం ఐదేళ్లు పూర్తిగా పరిపాలిస్తామని వివరించారు. చంద్రబాబు ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా… జగన్మోహన్ రెడ్డి విజయాన్ని అడ్డుకోలేరన్నారు.